ఆడపిల్లలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి

1చూసినవారు
ఆడపిల్లలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి
జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ అభిలాష అభినవ్‌ మాట్లాడుతూ, ఆడపిల్లలు ఆత్మవిశ్వాసంతో ఆకాశమే హద్దుగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. నేటి సమాజంలో బాలికలు అన్ని రంగాల్లోనూ బాలురతో సమానంగా రాణిస్తున్నారని, చదువుతో పాటు ఆటలు, సాంస్కృతిక రంగాల్లోనూ అద్భుత ప్రతిభ కనబరుస్తున్నారని కొనియాడారు. ప్రతి ఒక్కరూ లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. జిల్లాలోని కేజీబీవీలు, వసతి గృహాల్లో విద్యార్థినులకు మెరుగైన వసతులు కల్పిస్తూ, వారి మేధోవికాసానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్