సారంగాపూర్ మండలం అడెల్లి గ్రామంలో శ్రీ మహా పోచమ్మ అమ్మవారి గంగనీళ్ల జాతర వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా, జిల్లా ఎస్పీ జానకి యాకర్పల్లి గ్రామంలో అమ్మవారి ఆభరణాలను సాంప్రదాయ ప్రకారం స్వయంగా ఎత్తుకుని ఊరేగింపులో పాల్గొన్నారు. జాతర సందర్భంగా పోలీసుల ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రెండు రోజులపాటు జరిగిన ఈ గంగనీళ్ల జాతర ప్రశాంతంగా ముగిసిందని పేర్కొన్నారు.