ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రావలసిన బకాయిలను తక్షణమే చెల్లించాలని బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం హైదరాబాద్ లోని ధర్నా చౌక్ లో చేపట్టిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములైన ఉద్యోగులను కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా వంచిస్తోందని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉపాధ్యాయులకు ఐదు డీఏ బకాయిలు, పీఆర్సీ, సరెండర్ లీవులు, మెడికల్ బిల్లులను ఏళ్ల తరబడి పెండింగ్‌లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశాల్లో బీజేపీ ఎమ్మెల్యేలంతా ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు.