హామీల అమలులో ప్రభుత్వం ముందుకెళ్తోంది: వెడ్మ బొజ్జు పటేల్

4చూసినవారు
నిర్మల్ డిసిసి, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను దశలవారీగా నెరవేర్చుతూ ముందుకు వెళ్తోందని తెలిపారు. సోమవారం సారంగాపూర్ మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల ప్రచారాన్ని ఆయన ప్రారంభించారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే లక్షకు పైగా ఉద్యోగాలు కల్పించారని, సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్