జర్నలిస్టుల డిమాండ్లపై ప్రభుత్వాల నిర్లక్ష్యం: మహా ధర్నాకు పిలుపు
తెలంగాణలో జర్నలిస్టుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ-IJU) ఉద్యమ బాట పట్టింది. పెండింగ్‌లో ఉన్న డిమాండ్ల సాధన కోసం డిసెంబర్ 3న హైదరాబాద్‌లోని మాసబ్ ట్యాంక్‌లో రాష్ట్ర సమాచార శాఖ కార్యాలయం ముందు మహా ధర్నా నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి వెంకట గారి భూమయ్య పాల్గొన్నారు.