జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా బుధవారం వ్యవసాయ మార్కెట్ యార్డు గోదామును సందర్శించి, ధాన్యం బస్తాల నిల్వపై అధికారులకు సూచనలు జారీ చేశారు. గోదాములో ధాన్యం డంపింగ్ తీరును పరిశీలించి, లారీలలో వచ్చిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు భద్రంగా నిల్వ చేయాలని ఆదేశించారు. ఎక్కువమంది హమాలీలను నియమించుకొని డంపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. నిల్వ చేసిన ధాన్యం వివరాలు, అన్లోడింగ్ కోసం సిద్ధంగా ఉన్న లారీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను కూడా పరిశీలించారు.