ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

0చూసినవారు
జిల్లాలో మిగిలి ఉన్న వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను తక్షణమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన సోన్ మండలంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించారు. కేంద్రానికి వచ్చిన ధాన్యం, కొనుగోలు చేసిన ధాన్యం, తేమ శాతానికి వచ్చి తూకం వేయాల్సిన ధాన్యం వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిర్ణీత తేమ శాతానికి రాగానే ధాన్యాన్ని వెంటనే తూకం వేసి, మిల్లులకు తరలించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్