జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, గ్రామపంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం రాత్రి కలెక్టరేట్లోని తన చాంబర్లో నిర్వహించిన సమావేశంలో, జిల్లాలో మూడు దశల్లో జరగనున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా నిర్వహించాలని సూచించారు. దీనికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని, సిబ్బంది కొరత లేకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలిపారు.