మామడ మండలం బూరుగుపల్లి గ్రామంలోని పురాతన శివాలయంలో సోమవారం ధ్వజస్తంభ ప్రతిష్టాపన మహోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఉదయం వాస్తుజ్యోతిష్య పండితులు శివశ్రీ యోగేష్ స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించిన అనంతరం ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధ్వజస్తంభ దాతలైన సబ్ రిజిస్ట్రార్ శ్రీరామరాజు జ్యోతి దంపతులను ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.