దేవరకోట ఆలయంలో వైభవంగా కుడారై ఉత్సవం

4చూసినవారు
ధనుర్మాసం ఉత్సవాలను పురస్కరించుకుని నిర్మల్ జిల్లా కేంద్రంలోని పురాతన దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం స్వామివారి నిజరూప దర్శనం, కుడారై ఉత్సవం కన్నుల పండువగా జరిగింది. ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, తులసీ దళాలతో అర్చన కార్యక్రమం చేపట్టారు. అనంతరం 108 గంగాళల్లో నైవేద్యం సమర్పించి, భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ ఆమెడ శ్రీనివాస్, పూజరులు నవీన్, భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్