బుధవారం సోన్ మండలం కడ్తాల్ గ్రామ సమీపంలోని డబుల్ బెడ్ రూమ్ వద్ద విద్యుత్ వైర్లు తెగిపడటంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన పుట్టి సుదీర్ కు చెందిన గడ్డివాము పూర్తిగా దగ్ధమైంది. గ్రామ సర్పంచ్ గుర్రం రాము అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా, వారు వెంటనే చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. విద్యుత్ వైర్లను సరిచేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.