బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే: ఎస్పీ

460చూసినవారు
బాధితుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే: ఎస్పీ
ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించి పోలీస్ శాఖపై విశ్వాసాన్ని మరింత పెంపొందించడమే గ్రీవెన్స్ డే కార్యక్రమం ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా బాధితులు తమ సమస్యలను నేరుగా ఎస్పీ దృష్టికి తీసుకురాగా, సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్