‘గ్రీవెన్స్‌డే’తో సత్వర న్యాయం: ఎస్పీ

1చూసినవారు
‘గ్రీవెన్స్‌డే’తో సత్వర న్యాయం: ఎస్పీ
నిర్మల్ జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఎస్పీ జానకి షర్మిల బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజలకు సత్వర న్యాయం అందించే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆమె తెలిపారు. ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులకు ఫోన్ చేసి బాధితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. గ్రీవెన్స్ డే ద్వారా తమ దృష్టికి వచ్చిన సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్