మహిళ సమైక్య భవన నిర్మాణానికి భూమి పూజ

0చూసినవారు
మహిళ సమైక్య భవన నిర్మాణానికి భూమి పూజ
కుబీర్ మండలంలోని పార్డి (కే) గ్రామంలో మహిళా సమైక్య భవన నిర్మాణానికి ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ గురువారం భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. మహిళల అభ్యున్నతే దేశ అభివృద్ధికి పునాది అని, వారు ఆర్థికంగా, సామాజికంగా బలపడితేనే సమాజం ముందుకు సాగుతుందని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తోందని వివరించారు. అంతకుముందు, గ్రామంలో విఠలేశ్వర రుక్మిణి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలోనూ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్