ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ గురువారం కడెం మండల కేంద్రంలో మహిళా సమైక్య సంఘ భవన నిర్మాణానికి మహిళా సంఘాల సభ్యులతో కలిసి భూమి పూజ చేశారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో మహిళా సాధికారతకు పెద్ద పీట వేస్తున్నారని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం అని ఆయన అన్నారు. అనంతరం
కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు.