గుండంపల్లి గ్రామ రైతుల ఆందోళన

0చూసినవారు
గుండంపల్లి గ్రామ రైతుల ఆందోళన
నిర్మల్ జిల్లాలో రైతులు బుధవారం మొక్కజొన్న కొనుగోలును వేగవంతం చేయాలని, జొన్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆందోళన చేపట్టారు. దిలావర్ పూర్ మండలం గుండంపల్లి గ్రామ రైతులు నిర్మల్ - బైంసా జాతీయ రహదారిపై ధర్నా, రాస్తారోకో చేపట్టడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తహసీల్దార్ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా, కలెక్టర్ స్పష్టమైన హామీ ఇచ్చే వరకు ధర్నా విరమించేది లేదని రైతులు భీష్మించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్