నిర్మల్ జిల్లా కేంద్రంలోని బస్ డిపో బోయివాడ సమీపంలో గల గురుద్వారలో బుధవారం సిక్కుల మొదటి గురువు గురునానక్ 556వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిక్కు మతస్తులు ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. గురునానక్ దేవ్ సమాజంలో శాంతి, సమానత్వం, ఆధ్యాత్మికతను విస్తరింపజేశారని, ప్రతి ఏడాది కార్తీక మాసంలో పౌర్ణమి రోజున ఆయన జయంతి వేడుకలు జరుపుకుంటామని తెలిపారు.