వైభవంగా హనుమాన్ జన్మోత్సవ వేడుకలు

3చూసినవారు
నిర్మల్ జిల్లా కేంద్రంలో గురువారం హనుమాన్ జన్మోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. స్థానిక బోయివాడ దక్షిణముఖ ఆంజనేయస్వామి ఆలయంలో భక్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయాలు సందడిగా మారాయి. అనంతరం అన్నదానం చేపట్టారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్