మామడ మండలం దిమ్మదుర్తి గ్రామంలో ఆదివారం భీమన్న జాతర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జువ్వాడి శ్రీదేవి హాజరయ్యారు. గ్రామస్తులు, నాయక్ పోడ్ కులస్తులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె భీమన్న దేవుని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.