నిర్మల్ జిల్లా కేంద్రంలోని చింతకుంటవాడకు చెందిన హిందూ వాహిని నాయకుడు కందుల హరీష్, తన అనుచరులతో కలిసి శుక్రవారం బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. వీరితో పాటు సుమారు 200 మంది యువకులు, మహిళలు కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు బస్వపురం లక్ష్మీ నర్సయ్య, మాజీ ఎమ్మెల్యే నల్ల ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.