అంబరాన్నంటిన హోలీ సంబరాలు

2చూసినవారు
నిర్మల్ జిల్లాలో మంగళవారం హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. చిన్నా, పెద్దా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. వీధులన్నీ రంగులమయంగా మారి సందడి వాతావరణం నెలకొంది. ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, బైంసా మున్సిపల్ చైర్మన్ దత్తాద్రి, నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి కూడా ఈ సంబరాల్లో పాల్గొన్నారు. చిన్నారులు ఉత్సాహంగా పాల్గొని 'హ్యాపీ హోలీ' అంటూ కేరింతలు కొట్టారు.

సంబంధిత పోస్ట్