నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిల, పోలీస్ అధికారులు, సిబ్బందితో కలిసి హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. మన సంస్కృతి సంప్రదాయాలను తెలిపే పండుగల్లో హోలీకి ఎంతో ప్రాధాన్యత ఉందని ఆమె అన్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. ప్రజలందరూ ప్రశాంత వాతావరణంలో హోలీ వేడుకలు జరుపుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి, బైంసా ఏఎస్పీ రాజేష్ మీనా, నిర్మల్ ఏఎస్పీ సాయికిరణ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.