నిర్మల్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయంత్రం హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ దంపతులు, జిల్లా ఎస్పీ జానకి షర్మిల, ఏఎస్పీ సాయికిరణ్, డిఎఫ్ఓ సుశాంత్ సుఖదేవ్ బోబడే, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరూ ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ హోలీ పండుగ శుభాకాంక్షలు చెప్పుకున్నారు.