నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాంధీచౌక్ లో మంగళవారం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భరతమాత చిత్రపటానికి పూజలు చేసి, కాషాయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం, కార్యకర్తలు ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలిపారు. పట్టణ పురవీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ నాయకులు పాల్గొన్నారు.