కుభీర్ మండలంలోని సిర్పెల్లి గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా గురువారం రాత్రి ఒక ఇల్లు దగ్ధమైంది. గ్రామానికి చెందిన గంగాకిషన్ తన తల్లితో కలిసి శబరిమలై వెళ్లగా, అతని భార్య పిల్లలతో కలిసి తల్లిగారి ఇంటికి వెళ్లింది. ఇంట్లో మంటలు చెలరేగడంతో స్థానికులు వాటిని ఆర్పే ప్రయత్నం చేశారు. అయితే, అప్పటికే ఇంట్లోని సామగ్రి కాలిపోయింది. శుక్రవారం ఉదయం ఆర్ఎస్ఐ నరేష్ సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. ఈ దుర్ఘటనలో సుమారు రూ.9 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు.