దళిత నాయకులపై అక్రమ కేసులు: అంబేద్కర్ యువజన సంఘం ఆందోళన
న్యాయం కోసం పోరాడుతున్న దళిత నాయకులపై అక్రమ కేసులు బనాయించడాన్ని నిరసిస్తూ సారంగాపూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. అధ్యక్షులు పిల్లి నాగయ్య మాట్లాడుతూ, దళితుల భూములను ఆక్రమించి రోడ్లు వేసిన వారిపై ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసులు బనాయించడం ఏమిటని ప్రశ్నించారు. నాయకులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దేవి శంకర్, ఈశ్వర్, శంకర్, గోడి సిరం లింగం, దిలీప్, సన్నిలు పాల్గొన్నారు.