దివ్యాంగుల పట్ల అనుచిత ప్రవర్తన: DWO మధు సుధన్ పై చర్యలకు డిమాండ్

1చూసినవారు
గురువారం నిర్మల్ జిల్లాలో, కలెక్టర్ కార్యాలయం DWO సెక్షన్ లో పనిచేస్తున్న మధు సుధన్ పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని స్పందన దివ్యాంగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు ఇసాక్ అలీ డిమాండ్ చేశారు. దివ్యాంగుల పట్ల అనుచితంగా వ్యవహరిస్తూ, లెర్నింగ్ లైసెన్స్ విషయంలో అభ్యర్థులు నేరుగా రావాలని, ఇతరులు సమర్పించరాదని మధు సుధన్ ఆగ్రహం వ్యక్తం చేశారని ఆరోపణలున్నాయి. కొంతమంది దివ్యాంగులు నేరుగా రాలేని పరిస్థితి ఉన్నా, ఆయన పట్టించుకోవడం లేదని, తన ఇష్టానుసారం నడుచుకుంటున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. 2016 వికలాంగుల హక్కుల చట్టం ప్రకారం అతనిపై చర్యలు తీసుకోవాలని, అతన్ని సస్పెండ్ చేయాలని పలువురు దివ్యాంగులు డిమాండ్ చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you