పేదవాడి ఆకలి తీర్చిన ఇందిరా గాంధీ

1చూసినవారు
నిర్మల్ జిల్లా కేంద్రంలోని డీసీసీ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి భారతరత్న స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహరి రావు పూలమాలవేసి నివాళులర్పించారు. గరీబీ హఠావో నినాదంతో దేశంలోని పేదల ఆకలి తీర్చిన ఘనత స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరా గాంధీకే దక్కుతుందని, భారతదేశం కీర్తిని ప్రపంచం నలుమూలల చాటి చెప్పిన ఉక్కుమనిషి ఇందిరాగాంధీని కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్