స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఇందిరా మహిళా మైనారిటీ యోజన పథకం అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, జిల్లా వ్యాప్తంగా వచ్చిన ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, అర్హులైన లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయాలని ఆయన ఆదేశించారు. ఈ పథకం ద్వారా మైనారిటీ మహిళలకు లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని సూచించారు.