ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణి

5చూసినవారు
ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణి
నిర్మల్ జిల్లా కేంద్రంలోని 23వ వార్డు కబూతర్ కమాన్ కాలనీలో బుధవారం కౌన్సిలర్ రుకియా ఫిర్దోస్ యూనిస్ అలీ ఇందిరా మహిళా శక్తి చీరలను పంపిణీ చేశారు. మహిళల సంక్షేమం, ఆర్థిక సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తూ పలు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని, మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ప్రతి ప్రభుత్వ పథకం అమలులో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.