పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి

1131చూసినవారు
పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి
నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు, ముఖ్యంగా విద్యార్థినులకు మరుగుదొడ్లు, మూత్రశాలల కొరత తీవ్రంగా ఉందని, దీనిపై CYSS జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శీతల్కర్ అరవింద్, USFI జిల్లా కార్యదర్శి నవీన్ గురువారం జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్నకు వినతిపత్రం అందజేశారు. జిల్లా వ్యాప్తంగా సర్వే నిర్వహించి, కొత్త మరుగుదొడ్లు నిర్మించాలని, పాడైన వాటిని మరమ్మతు చేయాలని, నీరు, పరిశుభ్రత సౌకర్యాలు కల్పించాలని వారు కోరారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్