గోదావరి ఘాట్ల వద్ద ముమ్మరంగా పారిశుద్ధ్యం!

1చూసినవారు
గోదావరి ఘాట్ల వద్ద ముమ్మరంగా పారిశుద్ధ్యం!
బాసర క్షేత్రానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం గోదావరి పుష్కర ఘాట్ల వద్ద మంగళవారం పారిశుద్ధ్య పనులు చేపట్టారు. ఆలయ శానిటేషన్ అధికారి రాజేందర్ పర్యవేక్షణలో వాగ్దేవి సొసైటీ సిబ్బంది ఘాట్లపై పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తను తొలగించారు. అనంతరం మెట్లపై బ్లీచింగ్ పౌడర్ చల్లి శుభ్రం చేశారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు అసౌకర్యం కలగకుండా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.