సారంగాపూర్ మండలం అడెల్లి గ్రామంలోని శ్రీ మహా పోచమ్మ అమ్మవారి విగ్రహ పునః ప్రతిష్టాపన మహోత్సవ ఆహ్వాన పత్రికను ఆలయ కమిటీ సభ్యులు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు హైదరాబాద్ లో శనివారం అందజేశారు. సోమవారం నుండి 7వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాలకు హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ భోజ గౌడ్, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ జెడ్పిటిసి రాజేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.