మహిళల భద్రత కోసం నిర్మల్ జిల్లాలో ప్రవేశపెట్టిన "పోలీస్ అక్క" కార్యక్రమం ప్రతిష్టాత్మక స్కోచ్ అవార్డు గెలుచుకుంది. ఈ సందర్భంగా, బుధవారం కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కూచాడి శ్రీహరి రావు జిల్లా ఎస్పీ జానకి షర్మిలను శాలువాతో సన్మానించి అభినందించారు. పోలీస్ అక్క కార్యక్రమానికి జాతీయస్థాయిలో గుర్తింపు రావడం గర్వించదగ్గ విషయమని, ఈ కార్యక్రమం ద్వారా దాదాపు 7,000 మంది విద్యార్థినులు, మహిళలకు అవగాహన కల్పించడం గొప్ప విషయమని శ్రీహరి రావు కొనియాడారు.