సొసైటీ ప్రతిష్ట దెబ్బతీసేలా వ్యవహరించడం సరికాదు

0చూసినవారు
లక్ష్మణచందా మండలం బాబాపూర్ గ్రామంలో మత్స్యకార సొసైటీ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించడం సరికాదని గంగపుత్ర సంఘం సభ్యులు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలిపారు. గ్రామంలో గంగపుత్ర సంఘానికి చెందిన పుట్టి భీమన్నను కుల బహిష్కరణ చేసి, సొసైటీ నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు అవాస్తవమని వారు పేర్కొన్నారు. సంఘానికి కోర్టు ద్వారా నోటీసులు పంపి ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అధికారులు స్పందించి చేపలు పట్టుకునేలా ఆదేశాలు జారీ చేయాలని వారు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్