నిర్మల్ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 30న ఉదయం 11 గంటలకు నిర్మల్ డిగ్రీ కళాశాల సెమినార్ హాల్లో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఉపాధి అధికారి విజయలక్ష్మి సోమవారం తెలిపారు. ఈ మేళాలో 3 ప్రైవేటు సంస్థలలో 60 ఉద్యోగ ఖాళీలకు ఇంటర్వ్యూలు జరుగుతాయి. అర్హత గల నిరుద్యోగ యువత తమ బయోడేటా, విద్యార్హత సర్టిఫికెట్లు, ఆధార్ జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని సూచించారు.