ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ జానకి షర్మిల అన్నారు. బుధవారం బైంసా పట్టణంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహించారు. వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి తమ అర్జీలను ఎస్పీకి సమర్పించారు. సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని ఆమె ఆదేశించారు. గ్రీవెన్స్ డే నిర్వహణతో తమ సమస్యలు పరిష్కారమవుతాయని ప్రజలు ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు.