బాధితులకు న్యాయం చేయాలి: ఎస్పీ

0చూసినవారు
బాధితులకు న్యాయం చేయాలి: ఎస్పీ
బైంసా పట్టణంలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో ఎస్పీ జానకి షర్మిల ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల వినతులను స్వీకరించిన ఆమె, సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. గతంలో పెండింగ్లో ఉన్న ఫిర్యాదులను కూడా వేగంగా పరిష్కరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ రాజేష్ మీనా పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్