నర్సాపూర్ (జి) మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన కండెల సత్యం బిజెపి కిసాన్ మోర్చా జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ గా నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ జిల్లా నాయకత్వం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. తనపై నమ్మకంతో ఈ బాద్యతను అప్పగించిన జిల్లా పార్టీ నాయకత్వానికి, కిసాన్ మోర్చా ప్రతినిధులకు కండెల సత్యం ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా రైతుల సమస్యలను, పార్టీ ఆశయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తానని ఆయన పేర్కొన్నారు. కండెల సత్యం నియామకం పట్ల తిమ్మాపూర్ గ్రామ ప్రజలు, బిజెపి కార్యకర్తలు, పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.