ఖానాపూర్: పోడు భూముల విషయమై ఎమ్మెల్యేకు సిపిఎం వినతి
అర్హులైన ఆదివాసులకు పోడు భూములను వెంటనే అందించేలా ఎమ్మెల్యే కృషి చేయాలని సిపిఎం జిల్లా శాఖ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి బొమ్మెన సురేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఠాగూర్ తిరుపతి లు మాట్లాడుతూ ఆదివాసులకు ఇచ్చిన భూములలో జెసిబిలు నడపడం దారుణమన్నారు. ఆదివాసులపై దాడులు చేసిన అటవీశాఖ అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు.