హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో మంగళవారం టీపీసీసీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ సమక్షంలో నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌కు నియామక పత్రం అందజేశారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి తన శక్తి మేరకు కృషి చేస్తానని వెడ్మ బొజ్జు పటేల్ తెలిపారు.