తెలంగాణ జన సమితి (తెజస) అధినేత, ఎమ్మెల్సీ ఆచార్య కోదండరామ్ ఆదివారం నిర్మల్ రానున్నారని తెజస జిల్లా అధ్యక్షుడు కడపత్రి తిలక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన సాయంత్రం 4 గంటలకు పెన్షనర్ల సంఘ భవనంలో ఉద్యమకారుల ముఖ్య సమావేశానికి హాజరవుతారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తారని పేర్కొన్నారు.