యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం

3చూసినవారు
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట జాతీయ రహదారిపై శుక్రవారం యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిలను ఉరితీయాలని కేటీఆర్ వ్యాఖ్యానించడం ఆయన అహంకారానికి నిదర్శనమని, కేటీఆర్ కు అహంకారం పరాకాష్టకు చేరిందని నిరసనకారులు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :