కుభీర్ మండలం సాంగ్వి గ్రామస్థులు బుధవారం తమ సమస్యల సాధనకు రోడ్డెక్కారు. ఆర్అండ్‌బీ ప్రధాన రహదారి నుంచి సాంగ్వి గ్రామానికి వెళ్లే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. సమస్యలను పరిష్కరించకపోతే స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు. స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు గడిచినా తమ గ్రామానికి మొరం రోడ్డు తప్ప బీటీ రోడ్డు వేయ లేదని ఆందోళన వ్యక్తం చేశారు.