లక్ష్మణచాంద మండలం సంగెం రాజు (32) దుబాయ్‌లో అనారోగ్యంతో బాధపడుతూ స్వదేశానికి తిరిగి పంపాలని కోరుతూ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. గత ఏడాది బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లి, అక్కడ అనారోగ్యం పాలయ్యాడు. కంపెనీ యాజమాన్యం కనికరించకపోవడంతో, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశాడు. రాజు కుటుంబ సభ్యులు అతన్ని స్వదేశానికి తీసుకురావాలని కోరుతున్నారు. రాజుకు భార్య, కుమారుడు ఉన్నారు.