బాసర బజార్ గల్లీలో వైభవంగా లక్ష్మీ గణపతి హోమం

0చూసినవారు
నిర్మల్ జిల్లా బాసరలోని బజార్ గల్లీలో వినాయక నవరాత్రి ఉత్సవాల ముగింపు సందర్భంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. బాలగణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎర్రం రాజు, పులోళ్ల రాజు ఆధ్వర్యంలో మండపం వద్ద లక్ష్మీ గణపతి హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. అర్చక వైదిక బృందం వేద మంత్రోచ్ఛారణల మధ్య దంపతులు సతీసమేతంగా భక్తిశ్రద్ధలతో పూజలు జరిపారు. ఈ పుణ్య కార్యక్రమంలో స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేపట్టి, ప్రజల శాంతి సౌభాగ్యాల కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

సంబంధిత పోస్ట్