దిలావర్‌పూర్: భూభారతి చట్టం అమలుతో భూ సమస్యల పరిష్కారం

56చూసినవారు
దిలావర్‌పూర్: భూభారతి చట్టం అమలుతో భూ సమస్యల పరిష్కారం
భూభారతి గ్రామ రెవెన్యూ సదస్సుల ద్వారా ప్రజల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అన్నారు. బుధవారం దిలావర్‌పూర్ మండలంలోని సాంగ్వి గ్రామంలో నిర్వహించిన భూభారతి గ్రామ రెవెన్యూ సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడి భూ సమస్యలు తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్