నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో గురువారం ప్లాస్టిక్ బ్యాగ్ రహిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి. సుచిత్ర ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలను విద్యార్థులకు వివరించారు. తెలుగు ఉపాధ్యాయుడు బిక్షపతి నాయక్ స్వయంగా తయారు చేసిన పేపర్ బ్యాగులు, బట్టల బ్యాగులను ప్రదర్శించి, దుకాణాలకు, కూరగాయల కొనుగోళ్లకు వెళ్ళేటప్పుడు వీటిని వాడాలని, తద్వారా ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించాలని పిలుపునిచ్చారు.