నిర్మల్ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు ఏకమయ్యాయని, అలాంటి శక్తులను తరమికొడతామని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. గతంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మున్సిపాలిటీలో అవినీతి, అరాచకాలకు పాల్పడ్డాయని ఆరోపించారు. అలాంటి పార్టీలను నమ్మితే మోసపోతామని, నిర్మల్ పట్టణాన్ని కాపాడే శక్తి ప్రజల ఓటుపై ఉందని, మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి ధర్మాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.