చంద్రగ్రహణం కారణంగా నిర్మల్ జిల్లాలోని ప్రధాన, చిన్న ఆలయాలను తాత్కాలికంగా మూసివేశారు. మంగళవారం మధ్యాహ్నం 3.21 గంటలకు ప్రారంభమై రాత్రి 7.52 గంటల వరకు కొనసాగే ఈ గ్రహణం అనంతరం, ఆలయాల్లో సంప్రోక్షణ చేసి తిరిగి తెరుస్తారు. గ్రహణ ప్రభావంతో ఆలయాలు నిర్మానుష్యంగా మారాయి.